ఏలూరు నగరంలో క్రికెట్ బెట్టింగు ముఠాలపై నిఘా మరింత పెంచామనీ, బెట్టింగులు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ సీఐ బోణం ఆది ప్రసాద్ తెలిపారు. రూరల్ స్టేషన్ పరిధిలో తంగెళ్ళమూడి శివారులోని అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం అరెస్టు చేశారు. తంగెళ్ళమూడి శివారులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఐపీఎల్ క్రి కెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్‌ఐ ఎన్. లక్ష్మణబాబు సిబ్బందితో దాడులు చేసి ఆకివీడులోని వెలమపేటకు చెందిన ఘంటా సింహాచలం, మండవల్లి మండలం భైరవపట్నం గ్రామా నికి చెందిన నున్నా రమేష్, ఆకివీడు రైల్వేస్టేషన్‌రోడ్డు ప్రాంతానికి చెందిన కొడమంచి నాగ, ఆకివీడు క్రిస్టియన్‌పేటకు చెందిన బల్లిపాడు భానుకిరణ్ లను అరెస్టు చేశారు. బెట్టింగ్ ముఠా ప్రధాన సూత్రదారుడైన హైదరా బాద్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి లెనోవా ల్యాప్‌టాప్స్ రెండు, లెనోవా ట్యాబ్‌లు రెండు, స్మార్ట్ ఫోనులు 10, కీప్యాడ్ ఫోన్లు మూడు, రూ. 13 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు ఇన్‌ఛార్జి డీఎస్పీ పైడేశ్వరరావు పర్యవేక్షణలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేకమైన నిఘా ఉంచామని తెలిపారు. ఎస్‌ఐ ఎన్. లక్ష్మణబాబు, హెడ్‌కానిస్టేబుల్ కమలాకర బాబు, కానిస్టేబుల్ ఆర్. మోహనకృష్ణ, వి.నాగార్జున, పి.నాగరాజు, హోంగార్డు చిరంజీవి ఉన్నారు.