టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అరెస్ట్‌కు నిరసనగా రాజమండ్రిలో సోమవారం అఖిలపక్ష సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ హర్షకుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి మదు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, టీడీపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాష్టీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, సీపీఎం, ఆమ్ ఆద్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ... ఆదిరెడ్డి కుటుంబ సభ్యుల అరెస్ట్‌లో సీఐడీ పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. వర్తించని సెక్షన్లు ఆదిరెడ్డి అప్పారావు, వాసులపై సీఐడీ పోలీసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రతికారంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. వైసీపీ చిట్ పండ్ కంపెనీలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.