రాష్ట్ర ప్రజలందరూ సంఖ్యామంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆదిశగా సంక్షేమ బాటలో పయనిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తున్నారని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలం లక్ష్మీపురం సచివాలయం పరిధిలో గల దామనపల్లిలో నిర్వహించిన గడపగడపకి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి రావాలంటే మరల జగనన్న ముఖ్యమంత్రి కావాలని అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. అలాగే గ్రామాలలో మంచినీరు విద్యుత్తు రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి జరుగుతుందని అవసరమైన చోట్ల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాకు సత్యారావు, గ్రామ సర్పంచ్ బలిరెడ్డి వసుంధర నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ బలిరెడ్డి సత్యారావు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.