ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు సూచన మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె. వి రమణ(ఎల్ఐసి రమణ) మండల అధ్యక్షుడు కొరుప్రోలు శ్రీను ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీ నుంచి దేవరాపల్లి గవర్నమెంట్ హై స్కూల్ నందు జరుగుతున్న పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ఉచిత కోచింగ్ సెంటర్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశాఖపట్నం కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. వి. రమణ విద్యార్థినీ విద్యార్థులకు 10వ తేదీన జరగబోవు పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్ పై పలు సూచనలు చేస్తూ వాటిపై విద్యార్థినీ విద్యార్థులకు పరీక్ష టిప్స్ మరియు టైం మేనేజ్మెంట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థినీ విద్యార్థులు అడిగిన సందేహాలను పూర్తిగా నివృత్తి చేశారు. అంతేకాకుండా తన సొంత నిధులతో 80 మంది విద్యార్థిని విద్యార్థులకు పాలిటెక్నికల్ స్టడీ మెటీరియల్ ను అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ కె. వి. రమణ ను ఘనంగా సన్మానించి, వారికి సమాచార హక్కు చట్టం బుక్కును జ్ఞాపికంగా అందించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ టిఎఫ్ జిల్లా అధ్యక్షులు సిరికి శ్రీనివాసరావు పి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శి సిహెచ్ పెద్ది నాయుడు, రాష్ట్ర కార్యదర్శి పోతల గోవిందు , ఆదిరెడ్డి ఈశ్వరరావు, ఉపాధ్యాయ సిబ్బంది కె. జ్ఞానేశ్వర్రావు, రమేష్ , ఉప్పు అజయ్, తదితరులు పాల్గొన్నారు.