పలాస ప్రగతి భవన్ లో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని డీఎస్సీ-1998 ఎంటీఎస్ టీచర్స్ సోమవారం కలిశారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాడు ప్రతిపక్షనేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం 'డీఎస్సీ-1998' అభ్యర్థులకు ఉద్యోగం కల్పించారన్నారు. ఇది 25 ఏళ్ల నాటి కలని గత ప్రభుత్వాల దృష్టికి అనేకమార్లు తమ సమస్యను తీసుకెళ్లామన్నారు.
తామిచ్చిన వినతులను చిత్తు బుట్టలకే పరిమితం చేశారని తెలిపారు. మా అందరికీ గురువుల స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అతనికి జీవితాంతం ఋణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖమాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజుతో కలిసి పాలాభిషేకం చేశారు.