రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడే రావాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మనుబోలు వైసీపీ నాయకుడు చేరెడ్డి కోదండరామిరెడ్డి, సోమిరెడ్డి సమక్షంలో మంగళవారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి అప్పులకుప్పగా చేశారన్నారు. నాలుగేళ్లకే రూ. 10లక్షల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. అయితే రాష్ట్రంలో రూ.2లక్షల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. మాయమాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చి రైతులను ముంచేశారన్నారు. అంతకు మునుపు కోదండరామపురం సెంటర్లో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు రామకృష్ణయ్య, వెంకట రమణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, చే రెడ్డి పద్మనాభరెడ్డి, మస్తాన్‌నాయుడు, మధు నాయుడు, కలికి రమేష్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, చిట్టిబాబు, ప్రసాద్, లక్ష్మయ్య, శ్రీధర్ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.