తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో చిత్రీకరణ ఎంత కలకలం రేపిందో చెప్పాల్సిన పని లేదు. అసలు ఆ వీడియో ఎవరు తీశారనే విషయాన్ని ఆలయ అధికారులు కనిపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. రాహుల్ రెడ్డి అనే భక్తుడు ఆనంద నిలయం వీడియో చిత్రికరణ చేశాడని ఆయన తెలిపారు. రాహుల్ ఉద్దేశపూర్వకంగా వీడియో చిత్రికరణ చేశాడన్నారు. రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. సెక్యూరిటీ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. సీవీఎస్వో, వీజీవోతో పాటు భద్రతధికారులను మందలించామన్నారు. భద్రతా వైఫల్యానికి కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.