రేపు ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు తాము వేచి చూస్తామని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం వెల్లడించారు. ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న తరుణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ పార్టీకి కావాల్సినంత మెజర్టీ రాకుండా హంగ్ వస్తే పరిస్థితి ఏమిటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ హంగ్ వస్తే జేడీఎస్ మద్దతు కీలకమవుతుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఈ ఉదయం తన్వీర్ అహ్మద్ చెప్పిన సంగతి తెలిసిందే. (తనను తాను జేడీఎస్ అధికార ప్రతినిధిగా తన్వీర్ చెప్పుకోవడం గమనార్హం.) ఈ క్రమంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం స్పందిస్తూ... మద్దతుపై నిర్ణయం తీసుకున్నామనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ అంశంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన్వీర్ అహ్మద్ ప్రస్తుతం జేడీఎస్ లో లేరని... ఆయన వ్యాఖ్యలకు విలువ లేదని చెప్పారు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు తాము వేచి చూస్తామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa