ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టు శివను పరామర్శించిన మాజీ ఉపసభాపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 12:37 PM

అవనిగడ్డ నియోజకవర్గంకు చెందిన పాత్రికేయుడు శివ కారును గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేయగా, శనివారం ఉదయం మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ శివను ఫోన్లో పరామర్శించారు. సంఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన ఘటనపై పోలీసులు వెంటనే విచారణ చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వేకననూరు గ్రామం నేడు ప్రశాంతతకు నిలయంగా మారుతోందని, అలాంటి సమయంలో విలేఖరి గరికిపాటి శివ కారును ధ్వంసం చేయటం బాధాకరమన్నారు. వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని బుద్ధప్రసాద్ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa