కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇంకా చర్చ సాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను తన బాధ్యతను నిర్వర్తించానని, ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం చేయాలో చెబుతుందని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. తాము వన్ లైన్ తీర్మానాన్ని ఆమోదించామని, దాని ప్రకారం పార్టీ అధిష్టానానికి వదిలేశామని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకోలేదన్నారు. నేను చేయాల్సింది చేశానని ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ విలేకరులతో అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీఎం పదవి ఎంపికను అధిష్టానానికి వదిలేసింది. గతంలో కర్ణాటక సీఎంగా పనిచేసిన అనుభవం సిద్ధరామయ్యకు ఉండగా, శివకుమార్ ముఖ్యమంత్రి అయితే తొలిసారి అవుతుంది.
సిద్ధరామయ్య కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సన్నిహితంగా చెబుతారు. సిద్దూకు ఆయన మద్దతు ఉందని చెబుతారు. అయితే శివకుమార్... పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచాడు. గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సన్నిహితంగా ఉంటారు