కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తననే సీఎంగా కోరుకుంటున్నారని సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయనతో వ్యక్తిగత సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సిద్ధరామయ్య చెప్పారు. ‘‘జాతీయ రాజకీయాల్లో ఇదొక మలుపు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని, చేతులు కలపాలని కోరుతున్నా’’ అని అన్నారు. మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కర్ణాటక సీఎం వ్యవహారంపై పార్టీ హైకమాండ్‌తో చర్చించేందుకు ఆయన ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.
మరోవైపు సీఎం పదవిని చెరి రెండున్నరేండ్లు పంచుకోవాలనే ప్రతిపాదనను డీకే శివకుమార్ తోసిపుచ్చినట్టు సమాచారం. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఉదంతాలను ఉటంకిస్తూ డీకే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.