ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల కొండలలో అక్రమ పూజలు

national |  Suryaa Desk  | Published : Wed, May 17, 2023, 08:41 AM

కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడు పర్వతం మీద అక్రమ పూజలు కలకలం రేపుతున్నాయి. ఈ పూజల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన నారాయణ స్వామి, మరో నలుగురితో కలసి ఈ పూజలు చేసినట్లు గుర్తించారు. ఈ పర్వతం పైనే మకరజ్యోతిని వెలిగిస్తారు. దీంతో ఈ పర్వతం భక్తులకు పరమ పవిత్రమైనది. అటవీశాఖ సంరక్షణలో ఉన్న ఈ ప్రాంతంలోకి నిందితులు ఎలా ప్రవేశించగలిగారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa