ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో బోర్డు అధికారుల తప్పిదాలు బయటపడుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే విద్యార్థిని భౌతిక శాస్త్రం-2 ఫెయిలైంది. దీంతో విద్యార్థిని ఆందోళనకు గురై రీవెరిఫికేషన్, జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసింది. కాగా, నిన్న విడుదల చేసిన రీవెరిఫికేషన్ ఫలితాల్లో గౌతమికి 60 మార్కులకు గానూ 59 మార్కులు వచ్చాయి. అధికారుల తప్పిదంతో విద్యార్థిని ఎంతో మానసిక వ్యథకు గురైనట్లు తెలుస్తోంది.