గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల 68 మంది జడ్జిలకు ఇచ్చిన పదోనతుల్లో 40 మంది పదోన్నతులను రద్దు చేసింది. మరో 21 మంది పదోన్నతులను కొనసాగిస్తూనే వారికి స్థానచలనం కలిగించింది. ఈ మేరకు హైకోర్టు రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. కాగా, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హరీశ్ హస్ ముఖ్ భాయ్ వర్మకు ఇచ్చిన ప్రమోషన్ ను కోర్టు కొనసాగించింది.