పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా సమర్పించే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్ర్టిక్ట్ ఇండస్ర్టియల్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డిఐఇపిసి) కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం కమిటీ చైర్మన్, కలెక్టర్ దిల్లీరావు సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమలను స్థాపించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్ధికాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. సింగల్ విండో ద్వారా ఇప్పటివరకు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 282 దరఖాస్తులు అందాయని, వాటిలో నిర్ధేశించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎనిమిది, కర్మాగారశాఖకు సంబంధించి మూడు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. షెడ్యూల్ కులాలు, తెగలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండ్ ఆప్ ఇండియా పథకంలో మరింతమంది పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని, దీనిపై పూర్తిస్థాయిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించాలన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను పూర్తిస్థాయిలో చర్చించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్‌సేఫ్టీ, నగరపాలకసంస్థ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 4,29,55,516ల పెట్టుబడి రాయితి, పావలా వడ్డీ, విద్యుత్ సబ్సిడీ, ప్రోత్సాహకాలను ఆమోదించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. కాన్ఫరెన్స్‌లో మెంబర్ కన్వీనర్ జిల్లా పరిశ్రమల అధికారి వై.వీరశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కెఎ్‌సఎస్. సీతారాం, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.ప్రసాదరావు, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు టి.నాగప్రసాద్, పి. శ్రీనివా్‌సబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa