ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లాకు చెందిన వారే. గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.