హిందూత్వ అనేది ధర్మం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆ పేరుతో దాడులకు పాల్పడడాన్ని తాము అంగీకరించబోమన్న ఆయన.. బజరంగ్ దళ్‌ను గూండాల గ్యాంగ్‌గా అభివర్ణించారు.
మనది సనాతన ధర్మమని, హిందూత్వను తాము ధర్మంగా పరిగణించబోమని స్పష్టం చేశారు. హిందూత్వ అంటే తమతో ఏకీభవించని వారిపై కర్రలతో దాడిచేయడం, ఇళ్లు కూల్చేయడం, డబ్బు దోచుకోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ బజరంగ్ దళ్‌ను బజరంగ్ బలి (హనుమంతుడు)తో పోల్చడం బాధాకరమని దిగ్విజయ్ అన్నారు.