పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ మండలం బొప్పూడి లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, వై. యస్. ఆర్. విలేజ్ క్లినిక్ ను శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేలా సచివాలయాలు పనిచేయాలన్నారు. వైయస్సార్ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ క్లినిక్ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa