సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో ముస్లిం వ్యక్తితో కుమార్తెకు పెళ్లిపై బీజేపీ నేత వెనక్కి తగ్గారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ యశ్పాల్ బెనమ్ తన కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈనెల 28న జరుగనున్న ఈ వివాహానికి సంబంధించి హిందూ సంఘాలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెళ్లి రద్దు చేశారు.