ఘంటసాల మండలం యండకుదురు శివారు జీలగలగండి కాలనీలో ఉపాధి హామీ పథకం పని ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వాకా రామచంద్రరావు మంగళవారం పరిశీలించారు. సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించాలని, కేరళ రాష్ట్రము మాదిరిగా రోజు కూలి రూ. 600 యివ్వాలని, ఉపాధిహామీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తదితర డిమాండ్ ల సాధనకై ఈ నెల 29 వ తేదీ ఉదయం 10 గంటలకు బందరు కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే సామూహిక రాయబారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ జ్యోతి నవీన్ కుమార్, మేట్లు గెడ్డం పద్మావతి, ఐనంపూడి కృష్ణారావు, సోమరోతు ప్రసాద్, చెన్నం పున్నయ్య, కత్తుల వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.