అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారని తెదేపా నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు , రేగళ్ల వీరారెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గంపలగూడెం సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టి ఏఈకు వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ బిల్లులో అదనపు చార్జీల పేరిట ప్రజల నుండి అదనంగా వసూలు చేసి వారిపై భారం మోపుతున్నారని మంగళవారం విమర్శించారు. కార్యక్రమంలో మానుకొండ రామకృష్ణ జంగా చెంచురెడ్డి , కాజా రవికుమార్, దిరిసాల వెంకట కృష్ణారావు, వేముల బాలయ్య, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.