ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్నటువంటి ఓ కూలి మృతి చెందిన ఘటన మంగళవారం కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన జొన్న సాంబశివరావు(63)మంగళవారం ఉపాధి హామీ పధకం కూలీ పని చేస్తున్న సమయంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉయ్యూరు తాసిల్దార్ కే మస్తాన్, ఉయ్యూరు ఎంపీడీవో జే. విమాదేవి తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని జొన్న సాంబశివరావు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa