కర్ణాటక అసెంబ్లీ కొత్త స్పీకర్గా మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూటీ ఖదెర్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో స్పీకర్గా ఒక ముస్లిం నేత ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఖదెర్ పేరును సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమర్థించారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో సభ ఏకగ్రీవంగా ఖదెర్ను ఎన్నుకున్నట్టు ప్రొటెం స్పీకర్ ఆర్వీ దేశ్పాండే ప్రకటించారు.