ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త స్టీవ్ హాంకే ‘వార్షిక దయనీయ సూచీ’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, బలహీనమైన జీడీపీ వృద్ధి.. ఇలా అన్నింట్లో జింబాబ్వే పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో వెనెజువెలా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్ దేశాలు తొలి 7 స్థానాల్లో ఉన్నాయి.