మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో లేఖను విడుదల చేశారు. లేఖలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి ఫర్నిచర్ కు అయిన ఖర్చును తానే భరించానని తెలిపారు. దానికి సంబంధించిన బిల్లులు తన వద్ద ఉన్నాయని చెప్పారు.
కవిత షెల్ కంపెనీల నుంచి మారిషస్ లోని కైలాశ్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయిందని తెలిపారు. 25 - 25 - 30 కోట్ల నగదు బదిలీ అయిందని చెప్పారు. వాస్తవాలను బయటపెడుతున్నందుకు తనను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే కేజ్రీవాల్ కు సంబంధించిన మరో కుంభకోణాన్ని బయటపెడతానని చెప్పారు.