రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘సలహాదారులు కాదు.. స్వాహాదారులు. ఒక్క మైనారిటీ శాఖకే నలుగురు సలహాదారులా! వైసీపీ నాయకులకు ఉపాధి హామీ పథకం. మింగమెతుకు లేదు.. మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఒక్కొక్క సలహాదారుని మీద నెలకు రూ.5 లక్షలు ఖర్చు. సలహాదారుల నియామకానికి స్వస్తి పలకాలి.’’ అని ఆయన కోరారు.