కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారాబాయిల్డ్ బియ్యం కొనుగోళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని వెంటనే సేకరించి మిల్లింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సూచించారు. మొత్తం 6.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని, గడువులోగా బియ్యాన్ని ఎఫ్‌సిఐకి అందజేయాలని కేంద్ర మంత్రి కోరారు.