ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు చెప్పేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా 6 నుంచి 10 తరగతులకు 30,213 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లు, ప్రైమరీ స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వివరాలను విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుత కాలానికి తగ్గ ఉపాధ్యాయులు డిజిటల్ పాఠాలు బోధించాలని సూచించారు.