ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో శుక్రవారం బేస్తవారిపేట ఎస్సై మాధవరావు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి భారీ జరిమానా విధించడంతో పాటు కేసు నమోదు చేశామని చెప్పారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్ఐ మాధవరావు వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని అన్నారు.