నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి గుర్తుగా ఈ ప్రత్యేక నాణేన్ని తయారు చేశారు. ఈ నాణానికి ఒకవైపు అశోక స్తంభం, దేవనాగరి లిపిలో ‘భారత్’ అని.. ఇంగ్లీష్‌లో ‘ఇండియా’ అని రాసి ఉంటుంది. మరోవైపు పార్లమెంటు భవన సముదాయం ముద్రించి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa