యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరిహరులకు మంగళవారం విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగుతున్నాయి. లక్ష్మీనారసింహుడికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో, అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, స్పటిక మూర్తులకు శైవాగమ పద్ధతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. ప్రభాతవేళ సుప్రభాతంతో లక్ష్మీనృసింహుడిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని మూలమూర్తులకు, సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులను వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం జరిపి తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హెూమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.