జూన్ 7వ తేదీన CM జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశానికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలను జూన్ 5వ తేదీ మధ్యాహ్నంలోగా సాధారణ పరిపాలనశాఖ (కేబినెట్ విభాగం)కు పంపాలని CS కె.ఎస్.జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు.