జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఓ సర్కస్ కళాకారుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన ఆ వ్యక్తిని ఉదంపూర్‌కు చెందిన దీపుగా పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత తీవ్రంగా గాయపడిన దీపును దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే, మార్గంమధ్యలోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జమ్మూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa