ఇటీవల ప్రారంభించిన కొత్త పార్లమెంట్ నిర్మాణంలో వాడిన ఉక్కు మొత్తం మన విశాఖ స్టీల్ ప్లాంటు నుంచే వెళ్లింది. మొత్తం 6వేల టన్నుల ఉక్కు విశాఖ ప్లాంట్ నుంచి సరఫరా అయినట్లు రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వెల్లడించింది. నిర్మాణం కోసం 8 ఎంఎం నుంచి 24, 32 ఎంఎం వరకు ఉత్పత్తులని తయారుచేశామని ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.