రాష్ట్రంలో YCP సర్కార్ పాలనకు నాలుగేళ్లు పూర్తైంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని సీఎం జగన్ చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చామంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించాలన్న లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు చేపట్టారు. గ్రామ, వార్డుస్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లామని అంటోంది.