ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ఢీకొని సచివాలయ ఉద్యోగి దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 31, 2023, 03:25 PM

రైలు ఢీకొని సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకులుగా పనిచేస్తున్న ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం లోని బలగ లో నివాసముంటున్న మట్ట సోమేశ్వరరావు(30) నరసన్నపేట మండలంలోని కామేశ్వరి పేట సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం ఆయన స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనం పై బయలుదేరి కామేశ్వరి పేట సచివాలయానికి వెళుతుండగా రైలు గేటు వద్ద రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో రైల్ గేటు వేసి ఉందని అలాగే రెండు రైళ్లు ఒకేసారి వచ్చాయని స్థానికులు తెలిపారు. అయితే ఘటన సమయంలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. మృతుడు సోమేశ్వరరావు రెండు నెలల క్రిందటే రణస్థలం పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ గా పనిచేస్తున్న అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ మేరకు జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com