సీఎం జగన్ పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంక్షలు విధించారు. వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా పత్తికొండ పట్టణంలో షాపులు అన్నింటినీ అధికారులు బంద్ చేయించారు. పత్తికొండలో ట్రాఫిక్ ఆంక్షలు బైపాస్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం జగన్ ప్రోగ్రామ్ కవరేజ్ చేసే మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. కెమెరామెన్ లు, ఫోటో గ్రాఫర్లకు అధికారులు సీఎం ప్రోగ్రామ్ పాస్లు ఇవ్వడం లేదు. కేవలం స్టాఫ్ రిపోర్టర్.. లోకల్ కంట్రిబ్యూటర్ మాత్రమే రావాలని ఆదేశాలు జారీ చేశారు. సభలో వీడియోలు తీయరాదని అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. అధికారుల ఆంక్షలపై జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.