ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచబ్యాంకు 14వ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఆయన ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు సారథ్యం వహించిన మొదటి భారతీయ-అమెరికన్ అయ్యాడు. ఆయనను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ పదవికి నామినేట్ చేశారు. అతను ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. బంగా గతంలో మాస్టర్ కార్డ్ సీఈవోగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa