శుక్రవారం బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో కనీసం 50 మంది మరణించారు మరియు 179 మంది గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.
రైలు ప్రమాదం సమాచారం, సహాయం కోసం SRC కార్యాలయం అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్, 6782262286ను విడుదల చేసింది. ఇవే కాకుండా హోరా హెల్ప్‌లైన్ - 03326382217, ఖరగ్‌పూర్ హెల్ప్‌లైన్ - 8972073925, 9332392339, బాలాసోర్ హెల్ప్‌లైన్ - 8249591559, 7978418322, షాలిమార్ హెల్ప్‌లైన్ - 9903370746 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందొచ్చు.