వైయస్ఆర్ యంత్ర సేవా పథకం రెండవ విడత ప్రారంభోత్సవానికి శుక్రవారం గుంటూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రాణాంతక జబ్బు సమస్యలతో కలసిన బాధితుల సమస్యలను తెలుసుకొని అండగా నిలిచారు. 24 గంటల్లోనే బాధితులకు తక్షణ సాయం అందించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి , శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ లు , అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ , డిఆర్ఓ కే. చంద్ర శేఖర రెడ్డి , డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకట శివరామి రెడ్డి, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు లతో కలసి అనారోగ్యంతో బాధపడుతున్న సయ్యద్ ఫరూఖ్ ఆలీ , షేక్ ఖాదర్ బాషా లకు తక్షణ సాయం క్రింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెక్కులను అందజేయడం జరిగింది.