ఒడిశా రైలు ప్రమాద ఘటనలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్ జెన అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తల్లి చనిపోయాక 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు. తల్లి పెద్దకర్మ జరిగిన తర్వాత తిరిగి చెన్నై వెళ్తుండగా.. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మృతి చెందాడు.