చిత్తూరు జిల్లా, ఐరాలకు కూతవేటు దూరంలోని చెంగనపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత టీచర్ కావాలని శుక్రవారం మహిళలు కేంద్రానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. తమ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శాశ్వత టీచర్ లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి ఇన్‌చార్జి టీచర్లను వేయొద్దని ఏకకంఠంతో అన్నారు. శాశ్వత టీచర్‌ను వేసేవరకు అంగన్‌వాడీ ద్వారా రాష్ట్రప్రభుత్వం అందించే దేనినీ తాము తీసుకోబోమని స్పష్టంచేశారు. తమ సమస్యకు పరిష్కారం లభించకుంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు.