ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన (ఏబీ పీఎంజేఏవై), వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి ప్యానల్ ఆస్పత్రుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ.. వైయస్ఆర్‌ఆరోగ్యశ్రీ పథకం కింద 3,257 ప్రొసీజర్‌లలో ఉచితంగా వైద్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీ అని చెప్పారు. ఈ పథకం కోసం ఏటా రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ,, ఆయుష్మాన్ భారత్ కింద కేవలం 1,055 ప్రొసీజర్లకు మాత్రమే ఉచితంగా చికిత్స అందేదని, ప్రస్తుతం ఏకంగా 3,257 రోగాలకు చికిత్స అందుతోందని చెప్పారు.