వాణిజ్యపన్నుల శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఆ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. 2022–23లో జీఎస్టీ ఆదాయం 20.13% వృద్ధితో ఏకంగా రూ.28,092.87 కోట్లు నమోదవడం విశేషం. గతంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అంటే వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎప్పుడు తనిఖీలు చేస్తారో.. ఎలాంటి జరిమానాలు విధిస్తారో.. అన్న భయం ఉండేది. కానీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో అధికారులు వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా స్నేహపూర్వక శాఖగా మార్చారు. గత ఏడాది కాలంగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు అని మంత్రి బుగ్గన తెలియజేసారు.