ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయం 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్లోని ప్రమాద స్థలికి చేరుకుంది. ప్రమాదంపై ఒడిశా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు ఒడిశా పోలీసుల నుంచి ఈ కేసును తమ చేతుల్లోకి తీసుకోనున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఘటనకు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.