నెల్లూరు జిల్లా, అనంతసాగరం, మండలంలోని అనంతసాగరం-2, లింగంగుంట సచివాలయాలను డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ సుధాభారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కొందరు సిబ్బంది యూనిఫారం ధరించకపోవడంపై ఆసహనం వ్యక్తం చేశారు. లింగంగుంట సచివాలయంలో ఉద్యోగులు కొందరు లేకపోవడాన్ని గుర్తించి ఎక్కడకు వెళ్లారని ఆరాతీయగా సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం ముగిసేవరకు సచివాలయంలో అందుబాటులో ఉండాలని, పనితీరులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అనంతసాగరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి రుణాల మంజూరు, రికవరీపై సీఈవోలకు పలు సూచనలు చేశారు.