అవినాష్ రెడ్డి అరెస్టుపై సీబీఐ డొంకతిరుగుడు వైఖరి సరికాదని బుద్దా వెంకన్న హితవు పలికారు. వైసీపీ గొట్టంగాళ్లంతా టీడీపీ చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారన్నారు. సునీతా రెడ్డి పులివెందుల పులి అని... జగన్మోహన్ రెడ్డి పిల్లి మాత్రమేనని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. తనను ఎవరేం విమర్శించినా తొందరపడనిని చంద్రబాబుకు మాటిచ్చానన్నారు. కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించబోనన్నారు. తన మాటలు పార్టీకి నష్టం చేకూర్చకూడదనే తాను మాట్లాడటం లేదన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.