బెజవాడ ఇంద్రకీలాద్రి శుక్రవారం భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగుస్తుండడం, శుక్రవారం కావడంతో భక్తులు కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చారు. దూరప్రాంతాల భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కార్ల తో ఘాట్ రోడ్ నిండిపోయింది. భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. వంద రూపాయలలూ, 300 రూపాయల క్యూ లైన్లలో రద్దీ తక్కువగా ఉన్నా. ఉచిత క్యూ లైన్ మార్గంతో పాటు, 500 రూపాయల టికెట్ క్యూ లైన్ లు భక్తులతో కిక్కిరిసాయి. దుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందారు. మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి తీర్ధ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.