ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ ద్వారా అబద్ధాలు చెప్పించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 01:16 AM

-రాజధాని ప్రాంతంలో రైతులకు స్థలాలు కేటాయింపుల్లో అన్యాయం
-చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్‌
-తమ అనుచరులకు కాసులు పండే చోట స్థలాలు ఇచ్చారు
-సీఎంకు సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడం పెద్ద విషయమే
-రాజకీయ కక్షతో నాడు నాపై కేసులు పెట్టించారు
-జే.సీ.ప్రభాకర్‌రెడ్డి గురించి మాట్లాడటం అనవసరం

విజయవాడ నుంచి ప్రత్యేక ప్రతినిధి :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ర్ట గవర్నర్‌ నోటి ద్వారా అబద్ధాలు చెప్పించడం బాధాకరమైన విషయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అన్నారు.  రాష్ర్ట ప్రభుత్వం ఏది రాసిస్తుందో అదే గవర్నర్‌ చదువుతారన్నారు. అసెంబ్లీసమావేశాల అనంతరం విజయవాడలో ఆర్‌ అండ్గ బీ అతిథిగ హంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయమని వె.ఎస్‌.జగన్‌ అన్నారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తులు ఆడియో, వీడియోలతో సహా దేశంలో ఎక్కడా దొరకలేదన్నారు. కానీ చంద్రబాబు మా్త్రం అడ్డంగా దొరికిపోయినా పదవిలో కొనసాగుతున్నారన్నారు. మనవాళ్లు బ్రీఫ్‌డ్గ మీ అన్న వాయిస్‌ తనది కాదని చంద్రబాబు ఇప్పటికీ చెప్పలేదన్న విషయాన్ని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నానాతంటాలు పడ్డారని ఆయన అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాగానే అరగంటలోనే మళ్లీ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి గవర్నర్‌ చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మీడియాలో ఎక్కడ ఓటుకు కోట్లు విషయం వస్తుందేమో అన్న భయంతో చంద్రబాబు ఆ విషయాన్ని డైవర్‌‌ట చేయడానికి చాలా బాగా కష్టపడ్డారన్నారు. సరిగ్గా 11.06 నిమిషాలకు గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైతే 11.10 నిమిషాలకు చంద్రబాబు కేసును సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిందన్నారు. కేసును అడ్మిట్‌ చేసుకుని నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే చంద్రబాబు మా్త్రం అవన్నీ మామూలే అంటున్నారని, పైపెచ్చు తనపై 26 కేసులు పెట్టారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కేసును అడ్మిట్‌ చేసుకుని నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అవన్నీ మామూలే అంటున్నారని, పైపెచ్చు తనపై 26 కేసులు పెట్టారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.
  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా మూడేళ్లు కరువొచ్చిందన్నారు. ఓవైపు రైతులు కరువుతో అల్లాడుతుంటే మరోవైపు చంద్రబాబు మా్త్రం దేశం కంటే రాష్ర్టం అయిదు శాతం ఎక్కువ అభివద్ధి చెందిందంటున్నారని విమర్శించారు. జీఎస్‌టీ వచ్చినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు రాయితీలు కొనసాగుతాయని చట్టంలో ఉంటే చంద్రబాబు మా్త్రం మార్చితో ప్రత్యేక హోదా అయిపోతుందంటూ గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారని ఆక్షేపించారు. అలాగే రాజధానిలో ప్లాట్ల కేటాయింపు కుంభకోణంగా మారిందన్నారు. చంద్రబాబు మంు్తల్రు, ఎమ్మెల్యేలు, దగ్గర మనుషూలకు రోడ్ల పక్కన కూడళ్లలో ప్లాట్లు దక్కాయన్నారు. రైతులకు మా్త్రం ఎక్కడో మారుమూల పాట్లు ఇచ్చారని, ప్లాట్‌ల కేటాయింపు పచ్చ చొక్కావాళ్లకు బాగా కేటాయింపులు జరిగాయన్నారు.
 ఇది భూములు తీసుకున్న రైతులకు అన్యాయం జరిగినట్లు కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో భూమల లాటరీ అనేది ఓ స్కామ్‌గా తయారు చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్రకు నాలుగువైపులా రోడ్లు, రెండు కమర్షియల్‌ జోన్ల మధ్య 12వేల గజాల ప్లాట్లు ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడికి నేలపాడులో సడ్గ యాక్సిస్‌ రోడ్డు పక్కన ప్రభుత్వ షాపింగ్‌ కాంప్లెక్‌‌సను ఆనుకుని ప్లాట్లు కేటాయించారని చెప్పారు. స్పీకర్‌ పీఏకు వెలగపూడిలో సీడ్గ యాక్సిస్‌ రోడ్డు పక్కనే ప్లాట్లు ఇచ్చారని, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే కుమార్తెకు మందడంలో ఇరువైపులా రోడ్లు ఉన్న ప్లాట్లు కేటాయించారని తెలిపారు. అసలు లాటరీ పద్థతిలో పారదర్శకత ఉందా అని ప్రశ్నించారు. మంచి ప్లాట్లు మీరు తీసుకుని, ఎక్కడో మారుమూల ఉన్నవి రైతులకు ఇస్తారా అని నిలదీశారు. రాజధానిలో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌కు తెర తీసి, తన మనషూల భూములను రియల్‌ ఎస్టేట్‌ జోన్‌లో పెట్టారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలకు లబ్ది చేకూరేలా చేశారని ఆరోపించారు. రైతుల వద్ద భూములు తీసుకుని నీ మనుషూలకు మేలు చేయడం ధర్మమా అని ప్రశ్నించారు. ప్లాట్లే కాదు రాజధాని విషయంలోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. నూజివీడు, నాగార్జున వర్శిటీల వద్ద రాజధాని వస్తుందంటూ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
  తన వాళ్లతో మా్త్రం తక్కువ ధరలకు భూములు కొనిపించి ఇక్కడే రాజధాని అని ప్రకటించారని విమర్శించారు. ల్యాండ్గ పూలింగ్‌ విషయంలోనూ జాగ్రత్త పడ్డారని తనవాళ్ల భూములు పోకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు. జోన్ల విషయంలోనూ మోసం చేశారన్నారు. రైతుల భూములను అగ్రిజోన్‌లో పెట్టి తనవాళ్ల భూములను మా్త్రం రియల్‌ జోన్‌లోకి వచ్చేలా చేశారని పేర్కొన్నారు.
   మూడేళ్లయినా రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం జరగలేదన్నారు. అన్ని నిర్మాణాలూ తాత్కాలికమేనని బయట 1500 ఎస్‌ఎఫ్‌టీ పనులు చేస్తే సచివాలయం, అసెంబ్లీ కి రూ.10వేల చొప్పున ఖర్చు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. తనపై రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని  వె.ఎస్‌.జగన్‌ పేర్కొన్నారు. సోనియాగాంధీని విబేధించగానే కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మకై్క తనపై కేసులు వేశారన్నారు. తాము కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు మద్దతు ఇచ్చి కాపాడారని గుర్తు చేశారు. తెలుగు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నడిపించారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా,  మూడు నెలలకు బెయిల్‌ వచ్చే కేసును 16 నెలలు బెయిల్‌ రాకుండా చేశారని ఆయన అన్నారు. కావాలని ఎవరూ జైలుకు వెళ్లరని, తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరి తెలియ చేస్తున్నాయని జగన్‌ తెలిపారు. క షా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమన్నారు. బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే తనపై కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో రెండో డ్రైవర్‌ లేడని, డిక్కీలో పడుకున్నాడని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.
బస్సు కల్వర్టు పైనుంచి కిందకు పడినప్పుడు డిక్కీలో వ్యక్తి బతుకుతాడా అని ప్రశ్నించారు. పోస్టుమార్టం చయకుండా మృతదేహాలను తరలించే ప్రయత్నం చేశారని, నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకపోతే జైలుకు వెళ్తారనడం తప్పా అని అడిగారు. యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పించకుండా కుయుక్తులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వైఎస్‌ జగన్‌ ను విలేకరులు ప్రశ్నించగా ఆయన గురించి మాట్లాడడం అనవసరమని సమాధానమిచ్చారు. ఆయనకు మతిస్థిమితం ఉందో, లేదో తెలియదన్నారు. గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరగడం సహజమని వ్యాఖ్యానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa