నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఆదివారం దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. వేగంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో కేంద్రం అప్రమత్తమైంది. భారీ వర్షలు, వరదల పట్ల అధికారులు సన్నద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం కేంద్రమంత్రి అమిత్ షా వర్షాలు, వరదలు, తుఫానుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోస్తా ప్రాంత రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారు. అన్ని విషయాలపై సంక్షిప్తంగా చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa